జూలు విదిలించిన జురెల్.. గుజరాత్ టార్గెట్

కలం, వెబ్ డెస్క్:  అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జురెల్ జూలు (Jurel) విదిలించాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గుజరాత్ 211 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.

గుజరాత్ బౌలర్లలో రబాడ 4ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు కూడా వికెట్లు తీసినా పరుగులు మాత్రం సమర్పించుకున్నారు. కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 మెరుపు సిక్సర్లతో 75 పరుగులు చేసిన జురెల్, మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగేలోపే జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.

అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36 బంతుల్లో 55 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, మరో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సైతం 18 బంతుల్లో 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో హెట్మెయర్ 18 పరుగులు చేయడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో రబడ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఇప్పుడు 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్ ఈ స్కోరును ఎలా ఛేదిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>