దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలిచే పార్టీ బీజేపీ: ఎంపీ లక్ష్మణ్

కలం, వెబ్ డెస్క్: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలిచే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాతో ఇది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం, పుదుచ్చేరి మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో అప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు కూలిపోయాయని విమర్శించారు. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మోదీ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణను దోచుకున్నాయని ఆరోపించిన లక్ష్మణ్.. రేవంత్ పాలనకు చరమగీతం పాడి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఫలాలు తేడాలు లేకుండా అందిస్తున్నామని మోదీ మీద విశ్వాసంతోనే ఓటు వేశారని చెప్పారు. డబ్బు వెదజల్లినా తమిళనాడులో డీఎంకే కూటమి గెలవలేదన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడంతోనే మహిళలు ఛీ కొట్టారని, తెలంగాణ ప్రజలు రేవంత్​కు కూడా బుద్ధి చెప్తారని విమర్శించారు .ఈ నెల 10న హైదరాబాద్ లో మోదీ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>