Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ అభివృద్ధి కోసం భారీగా నిధులు ఇచ్చాము: ఎంపీ లక్ష్మణ్

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ (MP Laxman) పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన తొలుత కొమురవెళ్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు భారీగా నిధులు ఇస్తుందని చెప్పారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే శాఖ అభివృద్ధికి 5,500 కోట్లు కేటాయించిందని తెలిపారు. పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి కి రైలు మార్గం కల్పించింది బీజేపీ ప్రభుత్వమని, త్వరలోనే స్టేషన్ ప్రారంభిస్తామని అన్నారు. గత 12 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించడంతో, అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

దేశ ప్రజలు మూడుసార్లు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించి, ఎన్నికల్లో ఓడించిన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు కళ్ళుండీ చూడలేని కబోదులని, వారికి నోరున్నా మాట్లాడలేరని, చెవులున్నా వినలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులను చూసైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలనే ఉద్దేశంతోనే తాను కొమురవెల్లి రైల్వే స్టేషన్ పనుల పరిశీలనకు వచ్చానని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>