ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హనుమాన్ ఆలయ మండపం

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర లోని పర్బానీ (Parbhani) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యశ్వాడిలో హనుమాన్ ఆలయ మండపం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సుమారు 30 మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>