కాకా కలను నెరవేరుస్తాం.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఎంపీ కీలక ప్రకటన!

కలం , కరీంనగర్ బ్యూరో: ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చాలన్న దివంగత కాకా వెంకటస్వామి ఆశయాన్ని సాకారం చేసేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు (Pranahita-Chevella Project) ను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi Krishna) తెలిపారు.

కాకా వెంకటస్వామి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతాలకు సాగునీరు అందించాలని కలలు కన్నారని ఎంపీ పేర్కొన్నారు. సుమారు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్నది కాకా వెంకటస్వామి ఆశయమని తెలిపారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి కలసి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఎంపీ వెల్లడించారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రకు సంబంధించిన కొన్ని అంశాలు, అనుమతులు మరియు ఇతర సాంకేతిక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర జల సంఘం (CWC) ప్రత్యేక సమావేశం నిర్వహించి, మహారాష్ట్రతో ఉన్న అంశాలను పరిష్కరించుకుని అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు.

“కాకా వెంకటస్వామి కలను సాకారం చేయడం కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. ఆదిలాబాద్ ప్రాంతానికి అవసరమైన సాగునీటి సౌకర్యాలను అందించడమే మా లక్ష్యం” అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

ఉత్తర తెలంగాణ రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టు పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో పనిచేస్తామని ఆయన తెలిపారు. కాకా వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ఎంపీ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>