కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహబూబ్ నగర్ (Mahabubnagar) బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో అఖిల భారత రజక సంఘం అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాస్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రజక బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన ఖాజా పాషాను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా (Mahabubnagar) అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలన్నారు. చావు బతుకుల్లో పోరాడుతున్న చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా సహకారాలు అందించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. అగ్ర వర్ణాలకు అన్యాయం జరిగితే ఒకలా, బీసీలకు జరిగితే మరోలా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయంలో అన్ని పార్టీలు ఒక్కటే అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రైట్స్ అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, జాండ్ర సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు మహేందర్, నాయీ బ్రాహ్మణ సంఘ పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు దుర్గేశ్ రజక, బీసీ సమాజ్ జిల్లా కార్యదర్శి అశ్విని రమేష్ ,బీసీ సమాజ్ పట్టణ అధ్యక్షుడు నరసింహ, రజక సంఘం నాయకులు పాండు, కిషోర్ వెంకటయ్య, నగేష్, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Also: రాంగ్ రూట్‌లో ఆర్టీసీ బస్సు.. ఇంట్రెస్టింగ్‌గా మారిన పెండింగ్ చలాన్లు!
Follow Us On: X(Twitter)

