Mobile Popup Ad
Mobile Popup Ad

రాంగ్ రూట్‌లో ఆర్టీసీ బ‌స్సు.. ఇంట్రెస్టింగ్‌గా మారిన పెండింగ్ చ‌లాన్లు!

క‌లం, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌ (Hyderabad)లో రాంగ్ రూట్‌లో వ‌చ్చిన ఓ ఆర్టీసీ (RTC) బ‌స్సును యువ‌కుడు అడ్డుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న స‌ద‌రు బ‌స్సు డ్రైవ‌ర్‌పై యువ‌కుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ బైక్‌ను బ‌స్సుకు అడ్డుగా పెట్టాడు. అయినా డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా ముందుకు రాగా ఆ యువ‌కుడు కూడా బైక్‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్లాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు యువ‌కుడిని అభినందించారు. త‌గ్గేదేలే అంటూ పుష్ప స్టైల్‌లో బ‌స్సును అడ్డుకున్నాడ‌ని కామెంట్లు చేశారు. ఇక కొద్ది సేప‌టికే సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఈ ఇష్యూతో వైర‌ల్ అయిన స‌ద‌రు ఆర్టీసీ బ‌స్సు, యువ‌కుడి బైక్ పై ఉన్న చ‌లాన్లు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి.

ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా వ‌చ్చిన బ‌స్సు (TG 10 T 1469), ఆ బ‌స్సును ఆపిన బైక్ (TS 07 FL 0232)పై ఉన్న పెండింగ్ చ‌లాన్లు చూస్తే అందరూ షాక‌వ్వాల్సిందే. ఆ బ‌స్సు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయ‌డం ఇదేం మొద‌టి సారి కాదు. ఏకంగా ఇప్ప‌టి వ‌ర‌కు 8 సార్లు నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌గా.. స‌ద‌రు బ‌స్సుపై రూ.3,480 చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక బ‌స్సు సంగ‌తి ఇలా ఉంటే.. త‌గ్గేదేలే అన్న‌ట్లు బ‌స్సును ఆపిన బైక‌ర్‌ చ‌లాన్ల విష‌యంలో మాత్రం క‌ట్టేదే లే అన్న‌ట్లు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాడు. త‌ర‌చూ ట్రాఫిక్ రూల్స్ అతిక్ర‌మించే స‌ద‌రు యువ‌కుడి బైక్‌పై ఏకంగా 16 చ‌లాన్ల‌తో రూ.6960 పెండింగ్ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన‌ బ‌స్సును ఆపి హీరోగా మారిన బైక‌ర్ ఒక్క‌సారిగా జీరో అయిపోయాడు. రూల్స్ గురించి ప‌క్క వాళ్ల‌కు చెప్ప‌డమే కాదు.. మ‌నం కూడా పాటించాల‌ని నెటిజ‌న్లు స‌ద‌రు యువ‌కుడికి కౌంట‌ర్ ఇస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>