Mobile Popup Ad
Mobile Popup Ad

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ అరవింద్

కలం, యాదగిరిగుట్ట: నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) యాదాద్రి బుధ‌వారం యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. భువనగిరి మండలం సురేంద్రపురిలో జరుగుతున్న ‘దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్’ బీజేపీ శిక్షణ తరగతులకు హాజరైన ఆయన, అనంతరం స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీ అరవింద్‌కు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా, ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>