Mobile Popup Ad
Mobile Popup Ad

వరల్డ్‌కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు వార్నింగ్ బెల్

క‌లం, వెబ్ డెస్క్: మహిళల టీ20 వరల్డ్‌కప్ (World Cup) ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా జట్టుకు కీలక హెచ్చరిక లభించింది. వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన ప్రోటీస్ జట్టు, ఇప్పుడు తొలి మ్యాచ్‌కు ముందు తన లోపాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం ఆస్ట్రేలియాతో గ్రూప్-1లో కీలక పోరుకు సిద్ధమవుతున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Wolvaardt), ఈ ఓటమి సరైన సమయంలో వచ్చిన మేల్కొలుపుగా అభివర్ణించింది. కేవలం సాధారణ ఆటతో విజయాలు రావని, బౌలింగ్‌లో మరింత కచ్చితత్వం అవసరమని ఆమె భావించింది.

న్యూజిలాండ్ బ్యాటర్లు తమ జట్టును వ్యూహాత్మకంగా ఇబ్బంది పెట్టారని, ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని జట్టు నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించింది. అయితే ఈ ఓటమిలోనూ దక్షిణాఫ్రికాకు ఒక పెద్ద సానుకూల అంశం కనిపించింది. ఆల్‌రౌండర్ క్లోయ్ ట్రయాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసింది. కేవలం 26 బంతుల్లో అజేయ 61 పరుగులు చేసి ఆరు సిక్సర్లు బాదింది. ట్రయాన్ చాలా కాలం తర్వాత అత్యుత్తమ ఫామ్‌లో కనిపించిందన్నారు.

ఆమె బ్యాటింగ్ జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని వోల్వార్డ్ పేర్కొన్నారు. టోర్నీ ప్రారంభానికి ముందు ఆమె ఫామ్‌లోకి రావడం తమకు పెద్ద బలమని తెలిపింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో జరిగే కీలక మ్యాచ్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ప్రపంచకప్ ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో వ్యూహాలను మరింత పదునుపెడుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>