ఇందూరులో సైక్లింగ్ జాతర.. అస్మిత పోటీలకు శ్రీకారం

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ పోటీలను (Cycling Tournament) నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind)  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలకు నిజామాబాద్(Nizamabad) నుంచి అత్యధికంగా రిజిస్ట్రేషన్లు నమోదవడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు.  క్రీడాకారులు పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సైక్లింగ్ వంటి క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి విజయకాంత్ రావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డి, ఎస్‌ఆర్ విద్యాసంస్థల డీజీఎం గోవర్ధన్ రెడ్డి, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>