గుండెపోటుతో సీఐ మృతి.. పోలీస్ శాఖలో విషాదం

కలం, వెబ్ డెస్క్: విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ అలీ (CI Ahmed Ali) గుండెపోటుతో మరణించారు. గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అహ్మద్ అలీ గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే అహ్మద్ అలీ ప్రాణాలు విడిచారని వైద్యులు ప్రకటించారు. ఎంతో నిబద్ధతతో పని చేసే అహ్మద్ అలీ హఠాన్మరణంతో పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది. పోలీస్ ఉన్నతాధికారులు అహ్మద్ అలీ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>