కలం, నిర్మల్ : మామడ మండలంలోని (Mamada Mandal) వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా హామీల అమలులో ఆశించిన పురోగతి లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని పేర్కొన్నారు. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాంకిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

