Mobile Popup Ad
Mobile Popup Ad

సీబీఐ నోటీసులు.. క‌విత లాయ‌ర్ ఏమ‌న్నారంటే..?

క‌లం, వెబ్ డెస్క్‌: ఢిల్లీ లిక్కర్ పాల‌సీ కేసులో క‌విత‌ (Kavitha)కు సీబీఐ నోటీసులు రావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నోటీసుల‌పై క‌విత లాయ‌ర్ స్పందించారు. నోటీస్ ఏం లేద‌ని, కేవ‌లం హియ‌రింగ్ తేదీలు చెప్పేందుకు వ‌చ్చార‌ని తెలిపారు. 16న ఈ కేసుపై హియ‌రింగ్ ఉంద‌ని వెల్ల‌డించారు. అంత‌కు మించి ఏం లేద‌ని, దానికి సంబంధించి ఒక పేప‌ర్ ఇచ్చి వెళ్లార‌ని తెలిపారు. త‌మ వ‌ద్ద ఇంకా ఎలాంటి వివ‌రాలు లేవ‌ని మీడియాకు వెల్లడించారు. వ‌చ్చిన వాళ్లు సీబీఐ(CBI) అధికారులా? కాదా? అన్న దానిపై కూడా ఆయ‌న ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వలేదు.

ఈ కేసులో క‌విత‌కు (Kavitha) రౌస్ అవెన్యూ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీన్ని స‌వాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్ర‌యించింది. హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ మ‌రోసారి నోటీసులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read Also: ఫిరాయింపుల కేసు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Follow Us On: Sharechat

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>