Mobile Popup Ad
Mobile Popup Ad

వ్యూస్ పిచ్చి.. పిల్లాడిని స్కూటీ డిక్కీలో పెట్టిన తల్లి, నెటిజన్స్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఓ మహిళ వైరల్ వీడియో కోసం తన బిడ్డను స్కూటీ డిక్కీలో పెట్టి డ్రైవ్ చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. జహర్ భయ్యా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తల్లి పిల్లాడిని స్కూటీ డిక్కీలో కుక్కి సీటు‌ను మూసేస్తుంది. ఆ తర్వాత దర్జాగా వాహనం నడుపుకుంటూ వెళ్తుంది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం పసిబిడ్డ ప్రాణాలను పణంగా పెట్టడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ ఘటనపై విచారణ చేయగా, సదరు సోషల్ మీడియా (Social Media) ఖాతాలో ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు మరెన్నో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అదే పిల్లాడిని ఒక సంచిలో పెట్టి తీసుకువెళ్లడం, బురద నీటిలో మహిళ పడుకోగా, ఆమెపై ఓ వ్యక్తి నడిచే వీడియో కూడా ఉంది. ఇలాంటి వీడియోలు పిల్లల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, వైరల్ కంటెంట్ పేరుతో మైనర్లను ప్రమాదంలోకి నెట్టే క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>