కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని కోకాపేట (Kokapet)లో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. థియేటర్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ థియేటర్ ఫీచర్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆకాంక్షించారు.

