Mobile Popup Ad
Mobile Popup Ad

ఇబ్రహీంపేట గ్రామంలో జంట హత్యల కలకలం

కలం, నాగార్జునసాగర్ : నల్గొండ (Nalgonda)  జిల్లా అనుముల మండలం పరిధిలోని ఇబ్రహీంపేట (Ibrahimpet) గ్రామంలో  జంట హత్యలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి తల్లి, కూతురిని అత్యంత క్రూరంగా హత్య చేశారు. మృతులను రుద్రాక్ష సుమలత, ఆమె కుమార్తె రుద్రాక్ష లావణ్యగా గుర్తించారు. దుండగులు ముందుగా వారి కళ్లలో కారం చల్లి, అనంతరం కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన వెనుక భూ తగాదాల కోణం ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>