Mobile Popup Ad
Mobile Popup Ad

అయ్యో పాపం.. గుండె జబ్బుతో తల్లి, వింత జబ్బుతో కుమారుడు

కలం, ఖమ్మం బ్యూరో: ఆ కుటుంబానిది నిరుపేద నేపథ్యం.. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఇలాంటి పరిస్థితిలో కుటుంబాన్ని విధి వంచించింది. ఒకవైపు తల్లి (Mother) గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతుంటే, మరోవైపు కుమారుడు అరుదైన వ్యాధితో ఆసుపత్రి పాలయ్యాడు. కూలి నాలీ చేసుకుని జీవించే ఆ కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన వైద్యం చేయించుకుందామన్నా డబ్బులు లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, పాల్వంచ మండలం, పుల్లయ్యగూడెం గ్రామానికి చెందిన కాశీమల్ల కమలాకర్ అనే యువకుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. శరీరంలో నీటి శాతం ఎక్కువై పల్స్ రేట్ సమస్యతో మంచానికే పరిమితమయ్యాడు. మరోవైపు అతని తల్లి కూడా గుండె సమస్యతో బాధపడుతోంది. ఆమెకు తక్షణమే ‘స్టంట్’ వేయాలని వైద్యులు సూచించి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం అందాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తమను దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Read Also: గాంధీచౌక్ లో చర్చకు సిద్ధమా..? : అరవింద్ కు పీసీసీ చీఫ్ సవాల్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>