Mobile Popup Ad
Mobile Popup Ad

ఒకేసారి పదవతరగతి పాస్ అయిన తల్లీకొడుకులు

కలం, వెబ్ డెస్క్ : తల్లిదండ్రులు తమ సంతానం ఉన్నత చదువులు చదివి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. తమ కొడుకు లేదా కూతూరు ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి ఫలితాలు వచ్చే రోజు వరకు తల్లిదండ్రులు ఎంతగానో టెన్షన్ పడుతుంటారు. అదే.. కొడుకుతో కలిసి పరీక్ష రాసి పాసయితే.. ఆ ఘటన మరుపురానిది. ఇలాంటి సంఘటనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు (Palakollu)లో జరిగింది.

పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి ఆరో తరగతిలోనే చదువు ఆసేసింది. తరువాత చదువుకోవాలనే ఆరాటంతో తన కుమారుడు విజయ్ తో కలిసి పరీక్షలు రాశారు. రాయడమే కాకుండా లక్ష్మీ లహరి పాస్ అయి సత్తా చాటారు. కొడుకు విజయ్ 562/600 సాధిస్తే తల్లి లక్ష్మీ లహరి 360/500 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్స్ చూసుకుని తల్లికొడుకులు తెగమురిసిపోయారు. భావోద్వేగం చెందిన తల్లి విజయ్ ను పట్టుకుని కంటతడి పెట్టింది. కాగా, ఇన్నేళ్ల తరువాత చదువంటే ఇష్టంతో పరీక్షలు రాసిన లక్ష్మీ లహరిని పలువురు అభినందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>