ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. బియ్యం ధరలు తగ్గింపు

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యం ధరలు పెరుగుతున్న వేళ.. సామాన్యులకు ఊరట నిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఏపీ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యాన్ని (AP Rice Prices) తక్కువ ధరకే అందించనుంది. బీపీటీ సూపర్ ఫైన్ రైస్ కేజీ రూ.52, రా రైస్ కేజీ రూ.50లు చొప్పున రాష్ట్రంలోని రైతు బజార్లు, రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ప్రభుత్వం విక్రయించనుంది.

మధ్యతరగతి ప్రజలకోసం ప్రభుత్వం తీసుకోవచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం స్వాగతించదగినదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>