నీటి గుంతలో పడి అయిదేళ్ల చిన్నారి మృతి

కలం, జనగామ: మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలి (Child Died) తీసుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైప్ లీకవుతోంది. దీంతో మరమ్మతులు చేద్దామని సిబ్బంది 20 రోజుల కిందటే గుంత తవ్వారు. మళ్లీ పూడ్చకుండానే అలాగే వదిలేశారు. ఈ క్రమంలో పాఠశాలలో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న కవిత కుమార్తె మోక్షిత (5) ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది. గమనించిన సోదరి దీక్షిత విషయాన్ని తల్లికి చెప్పగా.. ఇరుగు పొరుగుతో కలిసి బయటకు తీసినప్పటికీ అప్పటికే మరణించింది.

మృతదేహంతో గ్రామస్థుల ఆందోళన..

కన్న కూతురు చనిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోధించింది. భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ గ్రామస్థులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>