Mobile Popup Ad
Mobile Popup Ad

నూతన అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం నూతన అక్రిడేషన్ (Journalist Accreditation) కార్డులను మంత్రి పంపిణీ చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డితో పాటు అక్రిడేషన్ కార్డుల సెలక్షన్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖ జర్నలిస్టులు కార్డులను అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నూతన అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. శుక్రవారం నుంచి జిల్లాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులను జారీ చేసేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు.
కార్డుల పంపిణీ పూర్తయిన తరువాత జర్నలిస్టుల సంక్షేమానికి చేపట్టవలసిన వివిధ కార్యక్రమాల గురించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివరించారు. ఒక సంస్థలో అక్రిడేషన్ కార్డు పొందిన జర్నలిస్టులు మరో సంస్థకు మారినప్పుడు వారు కార్డు రీ ప్లేస్ మెంట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని ప్రకటించారు. కార్డుల పంపిణీలో ఆలస్యమైనా కూడా పారదర్శకమైన విధానాలను అవలంబించడానికే ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 46 వేల మందికిపైగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఐఅండ్​పీఆర్ కమిషనర్ ముకుందరెడ్డి, అక్రిడేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>