epaper
Sunday, February 22, 2026
epaper

అభిషేక్ ఫామ్‌పై ఆందోళన లేదు: మోర్కెల్

కలం, వెబ్ డెస్క్ :  టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2026లో భారత జట్టు అదరగొడుతోంది. కానీ హిట్టర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మాత్రం ప్రతిసారి తుస్సుమంటున్నాడు. గ్రౌండ్‌లోకి వచ్చినంత సేపు కూడా క్రీజ్‌లో నిలబడంలేదు. డక్, గోల్డెన్ డకౌట్ అవుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో అభిషేక్‌ది ఇదే పరిస్థితి. ఇప్పుడు సూపర్-8 పోరు ప్రారంభం కానున్న సమయంలో అభిషేక్ శర్మ ఫామ్‌పై తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా ఈ అంశంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ (Morne Morkel)  స్పందించాడు.

అభిషేక్ ఆటపై ఆందోళన వద్దని, అదరగొట్టడం ఖాయమని ధైర్యం చెప్తున్నారు. వరుసగా డకౌట్లు వచ్చినా అతను తిరిగి రాణిస్తాడనే నమ్మకం జట్టుకు ఉందని తెలిపినట్లు సమాచారం. సూపర్-8లో దక్షిణాఫ్రికా (South Africa) టీమ్‌తో మ్యాచ్‌కు ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ వరుసగా విఫలమయ్యాడు. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు డక్ అయ్యాడు. ప్రస్తుత టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కూడా పరుగులు చేయలేకపోయాడు. అయినా అతను ప్రపంచ స్థాయి ఆటగాడని జట్టు నమ్మకం ఉంచిందని మోర్కెల్ చెప్పినట్లు సమాచారం. నెట్స్‌లో బాగా ఆడుతున్నాడని, మంచి ఆరంభం దొరికితే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తున్నట్లు తెలిపారు.

ఫీల్డింగ్ కూడా జట్టుకు మరో ఆందోళనగా మారింది. గ్రూప్ దశలో భారత్ తొమ్మిది క్యాచ్‌లు వదిలేసింది. ఈ విషయంలో జట్టు కష్టపడుతోందని మోర్కెల్(Morne Morkel) వివరించినట్లు సమాచారం. క్యాచ్‌లు మ్యాచ్ గమనాన్ని మార్చగలవని, అందుకే ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు ఉండే అవకాశం ఉందని సూచించారు. ప్రత్యర్థి బ్యాటర్లకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. బౌలింగ్‌లో కొత్త మార్గాలు అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.

 Read Also: బాబర్ అజామ్ డిమోషన్‌కు కారణం చెప్పిన హెస్సన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>