కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ నర్సస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ (Laxman) కి ప్రతిష్టాత్మకమైన ఎక్సలెన్స్ నర్సింగ్ లీడర్ అవార్డ్ – 2026 (Excellence Nursing Leader Award) అవార్డు దక్కింది. జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ నర్సింగ్ సమ్మిట్ లో లక్షణ్ ఈ అవార్డు అందుకున్నారు. నర్సింగ్ రంగంలో అందిస్తున్న సేవలు, నాయకత్వం, వృత్తిపరమైన కృషి, నర్సింగ్ సమాజం అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, నర్సింగ్ రంగంలో సేవ చేయడం ఒక బాధ్యత మాత్రమే కాదని.. సమాజ ఆరోగ్యానికి అంకితమైన గొప్ప అవకాశం అని తెలిపారు. ఈ గౌరవం తన వ్యక్తిగత విజయంగా కాకుండా తెలంగాణ నర్సింగ్ అధికారులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సు సందర్భంగా 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో చిన్నారులు, గర్భిణులను రక్షించడంలో ధైర్యసాహసాలతో సేవలందించిన నర్స్ అంజలి కుల్తేను లక్ష్మణ్ కలిశారు.

