జగిత్యాల ఆర్‌ఐపై సస్పెన్షన్ వేటు.. ఫిర్యాదులపై విచారణ

కలం, జగిత్యాల: జగిత్యాల(Jagtial) జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ అడ్మిన్ (Reserve Inspector) కిరణ్ కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. ఈ మేరకు శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. గత కొంతకాలంగా సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో కిరణ్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది సిబ్బందికి ఉద్దేశపూర్వకంగా డ్యూటీలు కేటాయించకుండా, వారి నుంచి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదులు కూడా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రాథమికంగా లభించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>