కలం, వెబ్ డెస్క్: రేడియేషన్ ప్రభావమో.. ఎక్కువ సేపు వాడటమో.. కారణాలు ఏమైనా సెల్ ఫోన్ పేలుతున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా చింతామానేపల్లి మండలం గూడెం గ్రామంలో సెల్‌ఫోన్ పేలడంతో బాలుడి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా అది పేలి లోకేశ్ (14) అనే బాలుడు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ముఖం ఛిద్రం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

