ప్రధాని మోడీ సభకు తరలిరండి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కలం మెదక్ బ్యూరో: తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర బీజేపీ సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తోందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) అన్నారు. రాజకీయాలకు అతీతంగా, దేశ ప్రధాని మన రాష్టానికి వస్తున్న వేళ.. ప్రతి ఒక్కరూ సభకు హాజరు కావాలని అంజిరెడ్డి కోరారు. ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని అన్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రపురంలో సంగారెడ్డి (Sangareddy) బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 10వ తేదీన సుమారు రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులలో సంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.2,360 కోట్లతో జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు మోడీ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>