స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి కేటీఆర్ అభినందనలు

కలం, వెబ్ డెస్క్: భారతదేశ తొలి స్పేస్-టెక్ యూనికార్న్‌గా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారతీయ స్పేస్-టెక్ రంగం నుండి 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,000 కోట్లు) కంటే ఎక్కువ విలువ గల స్టార్టప్‌గా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించిందని కొనియాడారు. హైదరాబాద్ కేంద్రంగా టీ-హబ్‌లో ప్రారంభమై, ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది గర్వకారణమని తెలిపారు. భారతీయ ప్రతిభకు, ఆశయాలకు ఉన్న అపారమైన శక్తికి ఇది ఒక నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ, భారతదేశాన్ని ఇలాగే గర్వపడేలా చేస్తూ ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. భవిష్యత్తులోస్కైరూట్ ఏరోస్పేస్ మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>