విద్యార్థుల సృజనాత్మకతకు ఆధునిక విద్యాసంస్థలు కీలకం: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆధునిక సదుపాయాలతో కూడిన విద్యాసంస్థలు విద్యార్థులలో సృజనాత్మకత, ప్రతిభను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్‌ దగ్గర నూతనంగా నిర్మితమైన ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన (Yennam Srinivas Reddy) మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో నాణ్యమైన విద్య ఎంతో అవసరమైందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి విద్యాసంస్థలు మహబూబ్ నగర్ విద్యా రంగానికి కొత్త దిశను చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు కట్టుబడి ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమగ్ర విద్యను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణాసుధాకర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, పాఠశాల డైరెక్టర్లు రవి నాయక్, నర్సింహ, మనోహర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: రోడ్డు లేదు..అంబులెన్స్ రాదు : ఇది గిరిజనుల గోడు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>