Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌

క‌లం, వెబ్ డెస్క్: ఏపీలో ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు (AP Inter Supplementary Results) విడుద‌ల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్ త‌న ఎక్స్ ఖాతా వేదిక‌గా ఓ పోస్టు చేశారు. ఫ‌లితాల‌ను అధికారిక వెబ్‌సైట్ http://resultsbie.ap.gov.in. లో గాని వాట్సాప్ నెంబ‌ర్ 9552300009 ద్వారా గానీ పొంద‌వ‌చ్చ‌ని విద్యార్థుల‌కు సూచించారు. ఇంటర్‌లో పాస్ అయిన‌ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ అవకాశం కల్పించడం ద్వారా 1.83 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ ఫలితాలను మెరుగుప‌ర్చుకున్న‌ట్లు తెలిపారు. అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన దాదాపు లక్ష మంది విద్యార్థులకు తమ చ‌దువును కొనసాగించేందుకు మరో అవకాశం లభించింద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేశ్ విద్యార్థుల‌ను అభినందించారు. భ‌విష్య‌త్తులో రాష్ట్ర‌ విద్యార్థులు మ‌రిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. .

ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల విష‌యానికి వస్తే, 2,29,034 మంది విద్యార్థుల్లో 1,35,435 మంది విద్యార్థులు తమ ఫలితాలను మెరుగుపర్చుకున్నారు. అలాగే 1,09,003 మంది అభ్యర్థుల్లో 42,379 మంది విద్యార్థులు పాస్ మార్కులు సాధించారు. సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో 91,303 మంది అభ్యర్థుల్లో 48,149 మంది విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను మెరుగుప‌ర్చుకున్నారు. 1,02,018 మంది అభ్యర్థుల్లో 57,327 మంది విద్యార్థులు పాస్ మార్కులు సాధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>