మూఢనమ్మకాలను పారద్రోలాలి.. శాస్త్రీయ చైతన్యం పెంచాలి: వేముల వీరేశం

కలం, నకిరేకల్: సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) పేర్కొన్నారు. శనివారం నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘జనవిజ్ఞాన వేదిక’ (Jana Vignana Vedika) సభ్యత్వాన్ని ఆయన అధికారికంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి గంగాధర్ భద్రయ్యల చేతుల మీదుగా ఎమ్మెల్యే వేముల వీరేశం సభ్యత్వ రశీదును అందుకొన్నారు. అనంతరం, సంస్థ ఆధ్వర్యంలో సమాజంలో చైతన్యం తెచ్చేందుకు చేపడుతున్న వివిధ రకాల కార్యక్రమాలు, విద్యా సంబంధిత శాస్త్రీయ ఆలోచనా విధాన వ్యాప్తికి చేస్తున్న కృషిని నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు సమాజంలో శాస్త్రీయ చైతన్యం పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. మానవ వికాసానికి, సామాజిక మార్పునకు శాస్త్రీయ ఆలోచనా విధానమే పునాది అని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>