ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి కీలక ముందడుగు!

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి (Adilabad Airport )ఆటంకంగా ఉన్న 765 కేవీ విద్యుత్‌ ప్రసార లైన్‌ మళ్లింపునకు పవర్‌గ్రిడ్‌ సంస్థ, జిల్లా కలెక్టర్‌ మధ్య ఎంఓయూ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పవర్‌గ్రిడ్‌ ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో కలిసి లైన్‌ మళ్లింపు ప్రక్రియపై వివరించారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ ఒప్పందం కీలకంగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్, పవర్‌గ్రిడ్‌ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ పిఆర్‌ఎస్‌ యాదవ్, డీజీఎం వెంకన్న, చీఫ్‌ ఇంజినీర్‌ పరిమళ, సీనియర్‌ డీజీఎం బిక్షపతి, సిఈ. చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>