పేదల ఆరోగ్యానికి చేయూత.. మేఘారెడ్డి ప్రత్యేక చొరవ

కలం, వనపర్తి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌), లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) ద్వారా పేద కుటుంబాలకు వైద్యసాయం (Medical Assistance) అందించడంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ సాయం సకాలంలో అందేలా ఎమ్మెల్యే కార్యాలయం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి దరఖాస్తు నుంచి సాయం మంజూరయ్యే వరకు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

2026 అక్టోబర్‌ 2 నాటికి వనపర్తి నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా 7,872 మంది లబ్ధిదారులకు రూ.19,98,40,700 మేర ఆర్థికసాయం అందినట్లు వెల్లడించింది. అదేవిధంగా అత్యవసర, ఖరీదైన వైద్యం అవసరమైన వారికి ఎల్‌ఓసీ ద్వారా 469 మందికి రూ.9,18,50,000 విలువైన వైద్యసాయం అందించినట్లు పేర్కొంది.

వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బంది

సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌ఓసీ కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాల సమీకరణ, సంబంధిత అధికారులతో సమన్వయం, తదుపరి చర్యలను సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ప్రతి నెలా సీఎంఆర్‌ఎఫ్‌ కోసం సుమారు 1,200 నుంచి 1,500 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించేందుకు సహకరిస్తున్నట్లు తెలిపింది. అత్యవసర వైద్య అవసరాలకు సంబంధించి నెలకు సుమారు 15 నుంచి 20 ఎల్‌ఓసీ కేసుల పరిష్కారానికి సహకరిస్తున్నట్లు పేర్కొంది.

పార్టీలకతీతంగా..

అర్హత ఉన్న పేద కుటుంబాలకు పార్టీలకతీతంగా ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. లబ్ధిదారులకు కనీసం రూ.10 వేల నుంచి అవసరాన్ని బట్టి రూ.5–6 లక్షల వరకు ఆర్థికసాయం అందుతున్నట్లు పేర్కొంది. అనారోగ్యంతో కుటుంబాలు అప్పులపాలు కాకుండా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెరుగైన వైద్యం (Medical Assistance) దూరం కాకుండా ప్రభుత్వ పథకాల ద్వారా అందే సహాయాన్ని సకాలంలో అందించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

Also Read : ఆస్తులపై కేటీఆర్ కీలక ప్రకటన.. సీఎంకు సవాల్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>