Mobile Popup Ad
Mobile Popup Ad

ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడిగినందుకు ముఖ్యమంత్రిని ‘బిచ్చగాడు’ అనడం సరికాదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) మండిపడ్డారు. మంగళవారం మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తెలంగాణ జీఎస్టీ రూపంలో రూ. 2 లక్షల కోట్లకు పైగా కేంద్రానికి చెల్లిస్తే, కేంద్రం కేవలం రూ. 85 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగతా నిధులు ఇతర రాష్ట్రాలకు మల్లించిందని ఆరోపించారు.

జగిత్యాల సమీపంలోని చల్గల్‌లో కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అనేక సార్లు కలిశానన్నారు. స్థలం సాకుతో పాఠశాలను తరలించవద్దని సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) కోరారు. జాతీయ రహదారులు, జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి, బ్లాక్ స్పాట్ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని ఎంపీకి, కేంద్ర మంత్రులకు వినతులు ఇచ్చినా స్పందన లేదని విమర్శించారు. ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణలో జాప్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

మామిడి మార్కెట్‌కు 10 ఎకరాల వాలంటరీ భూమి ముస్లింలకు ఇచ్చారని విమర్శించడం తగదన్నారు. 90 శాత మామిడి రైతులు, వ్యాపారులు హిందువులేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఘాజంగి నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ కోలుగూరి దామోదర్ రావు, బండ శంకర్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, గట్టు సతీష్, నక్కల రవీందర్ రెడ్డి, మ్యానపూరి మహేష్, కౌన్సిలర్లు నవీన్, చీటి లక్ష్మీనారాయణ, పిట్ట ధర్మరాజు, దుమలా రాజ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>