కలం, కరీంనగర్ బ్యూరో: గొల్ల, కురుమల ఆత్మ గౌరవానికి ప్రతీక బీరయ్య పట్నాలని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లె గ్రామంలో బీరయ్య-కామరాతి కళ్యాణ మహోత్సవం, మహంకాళి బోనాల పట్నాలు ఘనంగా జరుగగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay) మాట్లాడుతూ.. బీరయ్య-కామరాతి బోనాలు, పట్నాలు గొల్ల, కురుమలు అత్యంత భక్తితో పూజిస్తారన్నారు. ఒగ్గు కళ వంటి పవిత్ర సంప్రదాయాలను కాపాడుకుంటూ గ్రామ ఐక్యతను చాటడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఒగ్గు కళాకారులు వివిధ వేశాదారణాలతో కూడిన బీరయ్య, కామరాతి గురించి చెప్పిన ఒగ్గు కథ ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రకాష్, ఉప సర్పంచ్ తిరుపతి, కౌన్సిలర్ చెట్టే గంగాధర్, మాజీ ఎంపిటిసి శంకర్, మార్కెట్ డైరెక్టర్ శ్రీకాంత్, శ్రీనివాస్, గంగ మల్లయ్య, గొల్ల కురుమ సంఘం పెద్దలు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
Read Also: WHO హెచ్చరికలు.. ఎబోలా వైరస్ కేసులపై కేంద్రం ప్రకటన
Follow Us On: WhatsApp

