కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender ) విమర్శలు గుప్పించారు. తన రాజకీయ చరిత్రలో ఇంతగా వేధించే ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కార్ 22A కింద భూములు చేర్చి అన్యాయం చేస్తుందని మండిపడ్డారు.
బ్రోకర్లు, అధికారులు కలిసి భూములు కాజేసే యత్నం చేస్తున్నారని, ఈ కోవలోనే 22A భూములు అంటూ కొత్త రాగం అందుకున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహించారు. సెక్షన్ 22A కింద తమ భూముల్ని నిషేధిత భూముల కింద మార్చడంతో వేలాది మంది ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాదాద్ లో జీహెచ్ఎంసీ, హెచ్ఎమ్‌డీఏ అనుమతులతో అపార్టమెంట్స్ నిర్మించిన వారు ప్రస్తుతం నిరాశ్రయులు అవుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి వారిని భయపెడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఉచిత రేషన్ కేంద్రమే ఇస్తోంది..
తామే ఉచిత రేషన్ ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని ఈటల రాజేందర్ ఆగ్రహించారు. ఉచిత రేషన్ కేంద్రమే ఇస్తోందని స్పష్టం చేశారు. అయిన కూడా రేషన్ కార్డుపై రేవంత్, ఉత్తమ్ ఫొటోలు వేసుకున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం దిగిపోతే మళ్లీ రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.

