గ్రీన్‌ఫీల్డ్ హైవేపై బస్సు బీభత్సం.. సీటులోనే నలిగిపోయిన డ్రైవర్

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం (Wyra Road Accident) జరిగింది. దేవరపల్లి నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పిప్పిపిప్పి కావడంతో, డ్రైవర్ సీటులోనే నలిగిపోయి క్యాబిన్ ఇనుప శకలాల మధ్య చిక్కుకుపోయాడు.

​ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు, ఇతర వాహనదారులు వెంటనే స్పందించి సాహసోపేతంగా శ్రమించారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ​సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>