నిర్మల్‌లో కదిలించిన దృశ్యం: కొడుకు కష్టం తనదిగా.. వీపుపై మోసుకుంటూ!

కలం, నిర్మల్: ఆపదలో అండగా నిలిచే తల్లిదండ్రుల ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది ఈ దృశ్యం. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్‌లో ఓ తండ్రి తన కుమారుడిని వీపుపై ఎక్కించుకుని నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం పలువురిని కదిలించింది.

కుమారుడి కాలు విరిగిపోవడంతో ఆసుపత్రిలో చూపించేందుకు బస్టాండ్‌ నుంచి ఆసుపత్రి వరకు తండ్రి తన కుమారుడిని వీపుపై మోసుకుంటూ వెళ్లాడు. కాళ్లు సహకరించకపోయినా కుమారుడి బాధను తన భుజాలపై మోస్తూ ముందుకు సాగిన తండ్రిని చూసిన వారు భావోద్వేగానికి గురయ్యారు. కష్టం వచ్చినప్పుడు మాటలతో కాదు.. చేతలతో అండగా నిలవడమే తల్లిదండ్రుల ప్రేమకు అసలైన అర్థమని ఈ దృశ్యం మరోసారి చాటి చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>