కలం, మెదక్ బ్యూరో : రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో (Andole Congress) సంస్ధాగత, మండల కమిటి నియామకాల్లో అలస్యం… కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల నిర్వహణ పట్ల అలసత్వంకు దారి తీస్తుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన పలు కార్యక్రమాలు ,నిరసనలు అందోల్ లో అనుకున్నంతా స్ధాయిలో జరగకపోవడం చర్చనీయంగా మారుతుంది. మంత్రి కి , లోకల్ కాంగ్రెస్ క్యాడర్ కు మద్య సమన్వయలోపంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడుతున్నారా? లేక కాంగ్రెస్ క్యాడర్ అసంత్రప్తిలో ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నియామకాల ఊసే లేదు
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నియామకాలు మరియు మండల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు సంబంధించిన అధికారిక కమిటీలు లేదా నూతన నియామకాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన అన్నిరకాల కమిటిల నియమాకలు ఎక్కడ జరగలేదు. పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తున్న అశవాహుల్లో అసంత్రప్తి కన్పిస్తుంది. దింతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండుసార్లు ఓడిపోయిన దామోదర రాజనర్సింహను మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడానికి , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలు పదవులు రాకపోవడంతో అసంత్రప్తిగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోని మిగితా నియోజకవర్గాల సంస్ధాగత కమిటిలు పూర్తి చేసుకుంటే ..తమ నియోజకవర్గంలో మాత్రం నియమాకల ఊసే లేదని హస్తం క్యాడర్ వాపోతున్నారు.
పదియేళ్లుగా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డమని..నియమాకల్లో ఏమైన సమస్యలు ఉండే పార్టీ క్యాడర్ తో అంతర్గత సంప్రదింపులు జరిపి పూర్తి చేయాలి కానీ ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించడం పట్ల నారజ్ గా ఉన్నారు కార్యకర్తలు. స్థానిక ఎమ్మెల్యే ,మంత్రి దామోదర వ్యవహరశైలి వల్లనే పదవులు నియమాకాలు ఆలస్యం అవుతుండటంతో ..తమ బాధను ఏవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్ధితి అందోల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కన్పిస్తుంది. క్షేత్రస్ధాయిలో క్యాడర్ ఎంత బలంగా ఉంటే ..పార్టీబలంగా ఉటుందని, పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి అవకాశలు ఇవ్వల్సింది పోయి… అకారణంగా పదవుల నియమాకలు అలస్యం చేయడం పట్ల అందోల్ కాంగ్రెస్ కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ కార్యక్రమాలు జాడలేదు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కొలువుదీరి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు .అయితే, ఆందోలు నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క మండలంలోనూ, చెప్పుకోదగిన స్ధాయిలో కనీస కార్యక్రమం కూడా నిర్వహించలేదు . సంగారెడ్డి జిల్లాలో ఉన్న సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీపడి ర్యాలీలు, సంబరాలు నిర్వహించి సందడి చేశాయి. కానీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ లో మాత్రం ఎలాంటి హడవిడి, సందడి లేదు.
రాష్ట్ర పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన పలు కార్యక్రమాలను సైతం తూతు మంత్రంగా నిర్వహిస్తున్నారు. చాల సంధర్భాల్లో అధిష్టానం పిలుపు స్పందించకుండా అందోల్ స్థానిక నాయకులు చేతులెత్తేస్తున్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జోగిపేటకు రావడంతో ,సర్ కు సంబంధించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుగా కార్యకర్తలను భాగస్వాములను చేస్తు పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో సమన్వయలోపం స్పష్టంగా కన్పిస్తుంది . ఫలితంగా అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర పాల్గోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప , క్యాడర్ పెద్దగా ఉత్సహంతో కనిపించడంలేదు. డీల్లీలో రాహుల్ గాంధీ నిరసలకు సంఘీభావంగా , మద్దుతుగా రాష్ట్ర కాంగ్రెస్ సైతం నిరసనలు పిలుపునిచ్చింది. అ సందర్బంలోను అందోల్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దగా స్పందించలేదు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించవల్సిన స్ధానిక ఎమ్మెల్యే ,మంత్రి దామోదర రాజనర్సింహ తన క్యాడర్ కు సరైన దిశనిర్ధేశం చేయకపొవడం వల్ల పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడిపోతున్నమనే భావనలో సొంత క్యాడర్ ఉన్నది.
క్యాడర్ మౌనమేలా..
సాక్షత్తూ మంత్రి దామోదర రాజనర్సింహ పైన ప్రతిపక్ష పార్టీ నేరుగా ఆరోపణను చేస్తున్న చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. ,పుల్కల్ మండలంలోని సింగూరు బ్యాక్ వాటర్ ల ప్రభుత్వ స్థలాన్ని మంత్రి కుటుంబ సభ్యులు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆందోళన చేపట్టారు. తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి పలు అరోపణలు చేశారు. ఈ వ్యవహారం వారం రోజుల పాటు సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయంగా మారింది.
అలాగే సింగూరు ప్రాజెక్టు కట్ట మరమ్మతు పనులను బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులు నత్తనడకన సాగుతున్నాయని, నాణ్యత లోపించిందని తీవ్ర విమర్శలు గుప్పించింది. మంత్రి దామోదర రాజనర్సింహ అలసత్వం వల్ల సింగూరు అయకట్టు రైతులు క్రాప్ హలీడే తో తీవ్రంగా నష్టపోతున్నరని విమర్శలు చేస్తున్న ..క్షేత్రస్ధాయిలో బిఅర్ఎస్ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు .
ఈ వరుస పరిణామాలు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైనా.. కాంగ్రెస్ నేతలు వాస్తవాలు వివరించేందుకు మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. తమ నేత దామోదర లక్ష్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ శ్రేణులు ఘోరంగా విఫలమవుతున్నాయని, నాయకులు, కార్యకర్తలు మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బిఅర్ఎస్ పార్టీ రెండు సార్లు వరుసగా గెలిచినప్పటికి ,పార్టీ జెండాను నమ్ముకొని ఉన్నమని , ఎలాంటి ఇబ్బందులు వచ్చిన దామోదర రాజనర్సింహకు అండగా నిలిచి గెలిపించమని , కానీ తీరా ప్రభుత్వం ఏర్పడి తమనేత పెద్ద పదవిలో ఉన్న కనీసం తమను గుర్తించడం లేదనే అవేదన హస్తం పార్టీ కార్యకర్తల్లో కన్పిస్తుంది. తమకు ఏలాంటి పదవులు ,బాధ్యతలు ఇవ్వకుండా కార్యక్రమాలను నిర్వహించమంటే ఏలా సాధ్యమౌతుందని ప్రశ్నిస్తున్నారు. దింతో అందోల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివ్రద్ది పనులను ప్రచారం చేసుకొవడం, కాంగ్రెస్ పధకాలను ప్రజలకు చేరువ చేయడంలో కాంగ్రెస్ క్యాడర్ మౌనంగా ఉంటున్నారు.
ఒకవైపు సంస్ధాగత నియామకాల్లో అలస్యంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల పట్ల అలసత్వం స్పష్టంగా కన్పిస్తుందని … అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు చెబుతున్నారు. ఇప్పటికైన అన్ని మండలాలకు సంబంధించిన కమిటిల నియమాకలను పూర్తి చేసి ,పార్టీ ని మరింత బలోపేతం చేయాలని అందోల్ కాంగ్రెస్ శ్రేణులు కొరుతున్నాయి.

