అర్హులందరికీ పథకాలు అందేలా ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే పటేల్

కలం, లోకేశ్వరం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) అన్నారు. గురువారం లోకేశ్వరం ఎంపీడీవో కార్యాలయంలో 430 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ముధోల్ నియోజకవర్గానికి పింఛన్లు మంజూరయ్యాయని, ఇందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఉందన్నారు.

వృద్ధాప్య పింఛన్లతో పాటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 అందించాలన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే (Ramarao Patel).. అధికారులతో, ప్రజాప్రతినిధులతో, ప్రజలతో కలిసి రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం వల్లే దేశంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>