కలం, లోకేశ్వరం: ముధోల్ నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4.72 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ (MLA Pawar Rama Rao) తెలిపారు. గురువారం లోకేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భైంసా ఆశ్రమ పాఠశాలకు రూ. 1.90 కోట్లు, కుభీర్ మండలం దోడర్న పాఠశాలకు రూ. 99 లక్షలు, తానూర్ ఆశ్రమ పాఠశాలకు రూ. 1.73 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని 15 గిరిజన తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ. 1.60 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యేకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు.

