కలం, నిర్మల్: ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే సర్ (SIR) ను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల (Left Parties) ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా (Protest) నిర్వహించారు. .ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో గ్రామీణ పేదలు, వలస కూలీలు, ఆదివాసీలు, దళితులు, మైనారిటీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

