పేదలకు ఆర్థిక భరోసాయే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే సంజీవ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని , ఆడపిల్లల వివాహ సమయంలో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి (MLA Sanjeeva Reddy)  తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించిన మొత్తం 120 చెక్కులు, అలాగే CMRFకు సంబంధించిన మొత్తం 144 చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ..అనారోగ్యం, వైద్య చికిత్స వంటి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గంలోని అన్ని మండలాల అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>