కౌన్సిలర్ల పై ఎమ్మెల్యే ఫిర్యాదు

కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కరుణాకర్ రెడ్డి, స్వతంత్ర కౌన్సిలర్ పాండు కలిసి, దళిత కౌన్సిలర్ మంజులపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దళిత కౌన్సిలర్ మంజులపై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేసి, కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అసభ్యంగా ప్రవర్తించిన కౌన్సిలర్‌లపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, కౌన్సిల్ హాల్‌లో మహిళపై విరుచుకుపడటాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ ఘటనకు సంబంధించి చట్టపరమైన  చర్యలు తీసుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.

Read Also: ప్రత్యూష విషాదాంతం.. అలుపెరుగని అమ్మ పోరాటం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>