కలం, దేవరకొండ: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకొండ (Devarakonda) నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు, ప్రభుత్వ వసతులను మరింత చేరువ చేసేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సేవా విభాగాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ (MLA Balu Naik) మాట్లాడుతూ.. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేదలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని 5 పడకల నుంచి 10 పడకలకు విస్తరించినట్లు తెలిపారు. దీంతో డయాలసిస్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు. అత్యవసర వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఆర్టీఏ ఆధ్వర్యంలో నూతన అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. 2009లోనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు పునాది వేశానని, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఆసుపత్రిని మరిన్ని వసతులతో బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
దివ్యాంగులకు స్థానికంగానే సదరం క్యాంపులు
దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం గతంలో నల్లగొండ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోనే (Devarakonda Govt Hospital) వారానికి రెండు రోజుల పాటు సదరం క్యాంపులు నిర్వహించే ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దీంతో దివ్యాంగులకు ప్రయాణ భారం, సమయం, శారీరక శ్రమ తగ్గుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, కార్యాలయాలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి వైద్యాధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Also Read : మమతా బెనర్జీ మేన కోడలు ఆత్మహత్య.. షాక్‌లో దీదీ
Follow Us On: X(Twitter)

