పదవుల కంటే పాలమూరు అభివృద్ధి ముఖ్యం : ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పదవుల కంటే పాలమూరు అభివృద్ధి ముఖ్యమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్ పట్టణంలో రూ.603 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు బుధవారం భూమిపూజ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలమూరు పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్నారు.

రాబోయే మూడు సంవత్సరాల్లో నగరమంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయడమే లక్ష్యం గా పెట్టుకున్నామని తెలిపారు. విడతల వారీగా మహబూబ్‌నగర్‌లో యూజీడీ నిర్మాణ పనులు చేపడతామని ఆయన తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి మాత్రమే బయటకు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్ టి పి) ఏర్పాటు చేస్తామని,భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణంలో తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వసతుల విస్తరణ చేపట్టామన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధిలో విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం స్పష్టం చేశారు. నగర అభివృద్ధి అంటే కేవలం మౌలిక వసతులు కాదు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కూడా అవసరం ఉంటుంన్నారు. ప్రజల ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ తరాల అవసరాలపై ప్రత్యేక దృష్టి తమ ప్రభుత్వం పెట్టిందన్నారు.

పిల్లల కు విద్య, ఆరోగ్యం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజే బలమైన పునాది వేయాలనీ ఆయన (MLA Yennam) ప్రజలను కోరారు. బలహీన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచే శిక్షణా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 35 మంది వాలంటీర్లతో 30 పాఠశాలల్లో గత ఏడాది కార్యక్రమాలు ప్రారంభించి, ఈ ఏడాది 100 మంది విద్యా వాలంటీర్లతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాజకీయాలకు అతీతంగా మహబూబ్‌నగర్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించేవాడు నాయకుడు కాదని, రాబోయే తరాల కోసం ఆలోచించేవాడే ప్రజానాయకుడని అభివర్ణించారు. ప్రజల ఆశీర్వాదం, మేధావులు, జర్నలిస్టులు, మిత్రుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. మహబూబ్‌నగర్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని, ప్రజల సహకారం, సూచనలు, ఆశీస్సులతో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Also Read : కేసీఆర్ చెప్పినా కవిత వినలేదు: ప్రశాంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>