ఢిల్లీలో కదం తొక్కిన భద్రాద్రి సీపీఐ నాయకులు.. కేంద్రంపై ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిందేనని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. ‘బద్లావ్ జరూరీ హై’ అనే ప్రధాన నినాదంతో న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 500 మందికి పైగా సీపీఐ శ్రేణులు తరలివెళ్లారు. అజ్మీరీ గేట్ సెంటర్ నుంచి రాంలీలా మైదానం వరకు నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబూని భారీ ప్రదర్శన (CPI Rally) నిర్వహించారు.

​ఈ ర్యాలీ(CPI Rally)ని ప్రారంభించిన సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా, విద్యార్థి, మహిళా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సభ కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.​ ఈ ప్రదర్శనలో సీపీఐ నాయకులు కల్లూరు వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, సలిగంటి శ్రీనివాస్, పార్టీ ప్రజాసంఘాల బాధ్యులు భారీగా పాల్గొన్నారు.

Also Read : హైడ్రా అభ్యంతరం.. గణేశ్ నిమజ్జనాలపై కొత్త వివాదం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>