శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం..!

కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం (Srikalahasti temple) చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని అన్నప్రసాద పోటులో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక సిలిండర్ పేలిన దాటికి పక్కనే ఉన్న ఇతర సిలిండర్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో అన్నప్రసాద పోటులో అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి.

భారీ పేలుడు శబ్దం రావడంతో ఆలయంలో ఉన్న భక్తులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో పోటులో ప్రసాదాలు తయారు చేస్తున్న కార్మికులు కూడా బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం, గాయాలు కాకపోవడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>