జైపూర్‌లో గ్యాంగ్‌వార్ : రౌడీ షీటర్ దారుణ హత్య!

కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో మరోసారి గ్యాంగ్‌వార్ కలకలం రేపింది. స్థానిక రౌడీషీటర్ విజయ్ బాజియా (Rowdy Sheeter Vijay Bajiya) ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారును అడ్డగించిన 4 నుంచి 6 మంది దుండగులు, అతడిపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్ బాజియా అక్కడికక్కడే మృతి చెందాడు.

నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ ఘటనను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>