Mobile Popup Ad
Mobile Popup Ad

గల్ఫ్ కార్మికుల మృతదేహాల కోసం దుబాయ్‌కు చొప్పదండి ఎమ్మెల్యే

కలం, కరీంనగర్ బ్యూరో: దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చొప్పదండి నియోజకవర్గ వాసుల మృతదేహాలను స్వదేశానికి తెచ్చేందుకు ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు డా.మేడిపల్లి సత్యం (Medipalli Satyam) దుబాయ్ వెళ్లారు. దుబాయ్‌లో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మినీ బస్సు ఢీకొనడంతో అయిదుగురు మృతి చెందగా, వారిలో ముగ్గురు తెలంగాణ వాసులు ఉన్నారు. కొడిమ్యాల మండలం నమికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం (51), మల్యాల మండలం తక్కల్లపల్లికి చెందిన గొల్లపల్లి తిరుపతి గౌడ్ (42), మెట్‌పల్లి పట్టణానికి చెందిన అబ్బుల్ రఫీక్ (37) ఉన్నారు. ఇప్పటికే భారతీయ ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు హుటాహుటిన దుబాయ్ బయల్దేరి వెళ్లారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>