కలం, మెదక్ బ్యూరో: పటాన్ చెరు (Patancheru) ప్రాంత అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) తెలిపారు. పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లడుతూ.. 20 కోట్ల 46 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాలను నిర్మిస్తున్నట్లు , నిర్దేశించిన గడువుల్లోగా వీటిని పూర్తి చేసి లైసెన్స్ వ్యాపారస్తులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేకల మండి, చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మేకల మండితో పాటు ఆధునిక స్లాటర్ హౌస్‌తో పాటు ఎస్‌టీపీ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మార్కెట్‌లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) అన్నారు.
Read Also: సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సెన్సార్ పూర్తి..
Follow Us On : WhatsApp

